‘సాహో’ విషయంలో జరిగిన తప్పు.. ‘సైరా’కి రిపీట్ అవ్వలేదు!

Ad not loaded.

భారీ బడ్జెట్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా ముఖ్యం. సినిమా క్లిక్ అయితే గనుక మిలియన్ల కొద్దీ డాలర్లు వచ్చి పడుతుంటాయి. అందుకే ఓవర్సీస్ మార్కెట్ ప్లానింగ్ జాగ్రత్తగా వేసుకుంటారు. అయితే ఇటీవల విడుదలైన ‘సాహో’ విషయంలో అలా జరగలేదు. తొలి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాన్నే మిగిల్చింది. దానికి ముఖ్యకారణం అక్కడ తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌కే ఎక్కువ థియేటర్లు కేటాయించడమేనని తెలుస్తోంది. ఇది డిస్ట్రిబ్యూటర్ల పొరపాటనే చెప్పాలి. ‘బాహుబలి’ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని వారు అలా చేశారు. కానీ అమెరికాలో హిందీ మార్కెట్ కంటే తెలుగు మార్కెట్ అధికం. ‘సాహో’ విషయంలో జరిగిన తప్పు తమ విషయంలో జరగకూడదని ‘సైరా’ టీం ఈ విషయంలో జాగ్రత్తపడిన తీరు ఇప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ను ఆల్రెడీ సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చేసింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సాధ్యమైనంత వరకు ఎక్కువ థియేటర్లు తెలుగు వెర్షన్‌కే కేటాయించాలని సైరా మేకర్స్ సూచించారట. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హిందీ వెర్షన్ కి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారట.

ఈ సినిమాను ఓవర్సీస్ లో భారీగా రిలీజ్ చేశారు. ఆల్రెడీ రెండు మిలియన్ వసూలు చేసిన సైరా మూడు మిలియన్ వసూలు చేసిందంటే.. డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు వస్తాయి. కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌‌పై రామ్ చరణ్ రూ.270 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతి బాబు, తమన్నా, అనుష్క ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus