కత్తి కంటే పెన్నుకు పదునెక్కువ అనే పదాన్ని వింటూ వచ్చాం. కానీ.. ఈమధ్యకాలంలో ఒక కలానికి సరైన పదును చూసి చాలా ఎళ్ళైంది. రొడ్డకొట్టుడు సంగీతంతో.. సాహిత్యం కూడా సోసోగా సాగిపోతుంది. ఏవో కొన్ని ప్రేమ గీతాల్లో తప్పితే మంచి సాహిత్యం అనేది వినే భాగ్యం ప్రేక్షకులకు ఎందుకో లభించలేదు. ఈ లోటును తీర్చేశారు మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. “సైరా నరసింహా రెడ్డి” చిత్రం కోసం ఆయన రాసిన టైటిల్ సాంగ్ నిన్న సాయంత్రం విడుదలైంది. అమిత్ త్రివేది స్వరపరిచిన బాణీని శ్రేయా గోషల్ & సునిధి చౌహాన్ పాడారు.
“కదనరంగమంతా.. కొదమసింగమల్లే.. ఆక్రమించి.. విక్రమించి.. తరుముతోందిరా.. అరివీర సంహారా” వంటి పదాలు పాటకు ప్రాణం పోయగా.. శ్రేయా గోషల్ & సునిధి చౌహాన్ ల గాత్రం ప్రాణ ప్రతిష్ట చేశాయి. ఈమధ్యకాలంలో ఈస్థాయి అర్ధవంతమైన సాహిత్యంతో ఒక పాట రాలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకి ఒక హైలైట్ గా ఈ పాట నిలుస్తుంది. అక్టోబర్ 2న విడుదలకానున్న సైరాకి ఈ సాంగ్ వల్ల మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
బందోబస్త్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి