జార్జియా షెడ్యూల్ పూర్తి చేసిన సైరా టీమ్

తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితాన్ని “సైరా నరసింహారెడ్డి” మూవీ రూపంలో కళ్లకుకట్టేందుకు డైరక్టర్ సురేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ మూవీ క్లైమాక్స్ ని “జార్జియా”లో షూట్ చేశారు. ఐదువారాలపాటు సాగిన ఈ షెడ్యూల్ కోసం 54 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. బ్రిటిష్ సైన్యానికి, సైరా నరసింహ రెడ్డి అనుచరుల తో సాగే ఈ యుద్ధ సీన్ ని అంచనాలకు మించి చిత్రీకరించినట్టు సమాచారం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆన్ లొకేషన్ ఫోటోలను బట్టి చూస్తుంటే ఓ రేంజ్ లో షూటింగ్ జరిగినట్టు అర్ధమవుతోంది. ఇప్పటివరకు క్లైమాక్స్ ఫైట్ అంటే గ్లాడియేటర్, 300 , ట్రాయ్ గుర్తుకువస్తాయి. ఆ జాబితాలో బాహుబలి కూడా ఉంది.

వాటన్నిటికంటే బాగుండాలని ఈ ఫైట్ కోసం ఐదుగురు హాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫర్లు, టాప్ క్లాస్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సురేందర్ రెడ్డి అండ్ టీమ్ ఎంతో కఠోరంగానే శ్రమించారని టాక్. నరసింహారెడ్డి విరోచిత పోరాటాలు మరింత కనువిందు చేయాలంటే టెక్నికల్ టీమ్ మరింత శ్రమపడాల్సి ఉంటుంది. భారీగా వీఎఫ్ఎక్స్ చేయడం ద్వారా ప్రేక్షకులను యుద్ధక్షేత్రానికి తీసుకెళ్లినట్టు చేయవచ్చు. ఆ పనిలోనే ఇక నుంచి వీఎఫ్ఎక్స్ టీమ్ దిగనుంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలకరోల్ పోషిస్తోన్న ఈ చిత్రంలో సైరాకి మొదటి భార్యగా నయనతార, రెండో భార్య గా హ్యూమా ఖురేషి, మూడో భార్యగా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీకోసం తెలుగు ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus