శంఖం పూరించిన సైరా నరసింహారెడ్డి!

“ఖైదీ నం.150” తర్వాత మరో మెగా చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులు ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా “సైరా నరసింహా రెడ్డి” ఎనౌన్స్ మెంట్ మరియు మోషన్ పోస్టర్ విడుదలతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కానీ.. ప్రొజెక్ట్ ఎనౌన్స్ మెంట్ తర్వాత ప్రీప్రొడక్షన్ విషయంలో జరిగిన జాప్యం కారణంగా రెహమాన్, రవివర్మన్ వంటి టాప్ క్లాస్ టెక్నీషియన్స్ వైదొలగడంతో కాస్త భయపడినా రత్నవేలు రాకతో సంతోషించారు. అయితే.. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ కు వెళుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల బాధను అర్ధం చేసుకొన్న నిర్మాత రామ్ చరణ్ ముహూర్తం చూసుకుని ఇవాళ మొదలెట్టాడు.

చిరంజీవి స్వాతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డిగా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ లు కీలకపాత్రలు పోషిస్తున్న “సైరా నరసింహా రెడ్డి” రెగ్యులర్ షూటింగ్ ఇవాళ ప్రారంభం అయ్యింది. తొలుత 2018 ఆగస్ట్ లో చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నప్పటికీ షూటింగ్ మొదలైందే డిసెంబర్ లో కాబట్టి.. విడుదల ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus