భారతీయ సినిమాలు “సీక్రెట్ సూపర్ స్టార్”, “దంగల్”, “భజరంగీ భాయిజాన్” చైనాలో విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. బాహుబలి మొదటి పార్ట్ అక్కడ అంతక ఆకట్టుకోలేకపోయినా బాహుబలి 2 ని గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఇక బాహుబలి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాని కూడా చైనాలో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. ఖైదీ నంబర్ 150 తర్వాత చిరంజీవి చేస్తున్న “సైరా నరసింహారెడ్డి” (Sye Raa Narasimha Reddy) తొలి షెడ్యూల్ ని హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో కంప్లీట్ చేశారు.
తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో నయనతార, చిరు తోపాటు అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతిబాబు పాల్గొనబోతున్నారు. దీని తర్వాతి షెడ్యూల్ ని చైనాలో ప్లాన్ చేశారు. చైనాలో చిత్రీకరణ జరుపుకునే ఫారిన్ సినిమాలకు అక్కడి ప్రభుత్వం మంచి డిస్కౌంట్లు అందిస్తుందని సమాచారం. అందుకోసమే అక్కడ ఎక్కువ భాగం చిత్రీకరించాలని డైరక్టర్ సురేందర్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.