‘సైరా’ కి అప్పుడే భారీ రేటు పలుకుతుందిగా..!

మెగాస్టార్ 151 వ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 250 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన మేకింగ్ వీడియో,టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది… అంతే కాదు సినిమా పై ఆసక్తిని మరింత పెంచిందనే చెప్పాలి. ఇక అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇక ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ అదిరిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని భారీ రేట్లకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నైజాం రైట్స్ ను ‘సాహో’ నిర్మాణ సంస్థ అయిన ‘యూవీ క్రియేషన్స్’ దక్కించుకుంది. 30 కోట్లు పెట్టి రైట్స్ ను కొనుగోలు చేసారని సమాచారం. ఇక ఏపీ హక్కులు 60 కోట్లకు అమ్ముడయ్యిందట. ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఈ చిత్రం 15 కోట్లు పలికిందంట. ఇక సీడెడ్ 25 కోట్ల వరకూ పలికిందని తెలుస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రానికి 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ‘సైరా’ క్రేజ్ అలా ఉంది మరి…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus