Syed Sohel: నీవ్వు ఎందుకు పనికిరానని హేళన చేశారు: సోహెల్

  • August 2, 2023 / 07:14 PM IST

సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై, చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ షో లో మెహబూబ్ తో మంచి స్నేహాన్ని ఏర్పరచుకొని ఫ్రెండ్షిప్ కి నిదర్శనంగా నిలిచారు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక సోహెల్ కు వరుస సినిమా అవకాశాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటికే లక్కీ లక్ష్మణ్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు సోహెల్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత ఆర్గానికి మామా.. హైబ్రీడ్ అల్లుడు అంటూ వచ్చాడు. ఇది కూడా పరాజయాన్ని అందుకుంది. అయినా తగ్గేదేలే అంటూ సోహెల్ వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. శ్రీనివాస్ వింజ‌నంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో (Syed Sohel) సోహెల్ సరసన రూప హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 18న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే సోహెల్, ఇంకా చిత్రం బృందం బుల్లితెరపై సుమ నిర్వహిస్తున్న ఒక షోకి హాజరయ్యి సందడి చేశాడు. అయితే చివర్లో ఈ సినిమా ఒప్పుకోవడంతో తనను అవమానించారని ఎమోషనల్ అయ్యాడు.

‘‘లైఫ్ లో ముందుకెళ్లాలి.. యాక్సెప్ట్ చేస్తారా లేదా..? రియాల్టీ షో నుంచి వచ్చాడు, చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు అని అంటూ ఉంటే భయమేస్తూ ఉంటుంది. ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు, ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఏందిరా ఈ తేడా గాడు.. అది ఇది అంటూ చాలా హేళన చేశారు”.. అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus