Taapsee Pannu: నెటిజెన్ పై తాప్సి ఆగ్రహం.. దెబ్బకు దిమ్మతిరిగిపోయింది..!

సోషల్ మీడియాలో హీరోయిన్లకు ఎదో ఒకరకంగా కొంతమంది నెటిజన్లు తల నొప్పి తెప్పిస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. అసభ్యకరంగా ఏదో ఒక కామెంట్ చెయ్యడం.. దాంతో హీరోయిన్లకు కోపం వచ్చి ఏదో ఒకటి అనడం.. ఆ టాపిక్ కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుండడం కూడా మనం చూస్తూనే వస్తున్నాం. తాజాగా తాప్సి విషయంలో అది మరోసారి రిపీట్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి ఎక్కువవుతున్న వేళ..

ఆక్సిజన్, బెడ్లు దొరక్క చాలా మంది బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ తాప్సీ అలా ఇబ్బందులు పడేవారికి తగిన సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా పోస్టు చేస్తూ వస్తోంది. ఆక్సిజన్ సిలిండర్లతో పాటు అవసరమైన మందులు ఎక్కడ లభిస్తాయి అనే విషయాలను కూడా ఆమె పోస్ట్ చేస్తూ వస్తోంది. అయితే ఓ నెటిజన్.. ‘ఇలా ఇంట్లో కూర్చుని ట్వీట్లు వెయ్యకపోతే ఖరీదైన నీ కారును వాళ్లకు ఇచ్చెయ్యొచ్చు కదా ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటారు’ అంటూ కామెంట్ చేశాడు.

దానికి తాప్సికి చాలా కోపం వచ్చింది. ‘ఇలాంటి చెత్త మెసేజ్‌లతో నా టైం వేస్ట్ చెయ్యకు… నువ్వు ఇలాంటివే చెప్పాలనుకుంటే జనాలు పాండమిక్ నుండీ బయటపడే వరకూ దయచేసి నోరు విప్పొద్దు’ అంటూ కోరింది. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అవుతుంది. తాప్సికి ఆమె అభిమానులు మద్దతు పలుకుతున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus