Tabu: ఈ ప్రశ్న నిర్మాతలను ఎందుకు అడగరు.. టబు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సీనియర్ నటి టబుకు (Tabu) మంచి గుర్తింపు ఉంది. త్వరలో ఔర్ మే కహా దమ్ థా సినిమాతో టబు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అజయ్ దేవగణ్ (Ajay Devgn), టబు జంటగా ఈ సినిమాలో నటించారు. నీరజ్ పాండే డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టబు బాలీవుడ్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ వ్యత్యాసాలపై స్పందించారు. రెమ్యునరేషన్ వ్యత్యాసాల గురించి ఎప్పుడూ హీరోయిన్లనే ఎందుకు అడుగుతారని ఆమె అన్నారు.

నిర్మాతలను కూడా ఇలాంటి ప్రశ్నలు అడగవచ్చు కదా అని టబు అభిప్రాయపడ్డారు. అలాగే మీకు ఎందుకు ఎక్కువ మొత్తంలో పారితోషికం ఇస్తున్నారని హీరోలను అడగవచ్చు కదా అని టబు పేర్కొన్నారు. అలా చేస్తే ఈ విషయంలో ఎన్నో మార్పులు వస్తాయని టబు కామెంట్లు చేయడం గమనార్హం. అజయ్ దేవగణ్ టబు కాంబినేషన్ లో ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

ఔర్ మే కహా దమ్ థా సినిమాలో అజయ్ దేవగణ్ కృష్ణ పాత్రలో నటించగా టబు వసుధ పాత్రలో నటించారు. ఈ సినిమా మనసుని హత్తుకునే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిందని సమాచారం అందుతోంది. చిన్న వయస్సులోనే ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకున్న కృష్ణ, వసుధ ఎందుకు విడిపోయారు? తిరిగి మళ్లీ కలిశారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఔర్ మే కహా దమ్ థా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. రాబోయే రోజుల్లో అయినా ఈ సినిమా బుకింగ్స్ పుంజుకుంటాయేమో చూడాల్సి ఉంది. అజయ్ దేవగణ్, టబులను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus