నాగ చైతన్య, సునీల్.. లు హీరోలుగా తమన్నా,ఆండ్రియా వంటి భామలు హీరోయిన్లుగా కిషోర్ కుమార్ పార్ధసాని(డాలీ) డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘తడాఖా’. తమిళంలో సూపర్ హిట్టైన ‘వెట్టై’ కు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ‘శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై బెల్లంకొండ గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2013 వ సంవత్సరం మే 10న ఈ చిత్రం విడుదలయ్యింది. మొదటి సినిమాతోనే హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ చిత్రం.. ఎప్పటినుండో ఓ మాస్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న నాగ చైతన్య కు ఆ లోటుని తీర్చింది. నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 8 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 5.28 cr |
సీడెడ్ | 3.50 cr |
ఉత్తరాంధ్ర | 2.40 cr |
ఈస్ట్ | 1.30 cr |
వెస్ట్ | 1.20 cr |
గుంటూరు | 1.68 cr |
కృష్ణా | 1.01 cr |
నెల్లూరు | 0.90 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 17.27 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.82 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 19.09 cr |
‘తడాఖా’ చిత్రానికి రూ.17.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.19.09 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు రూ.1.89 కోట్ల లాభాలను మిగిలాయని చెప్పొచ్చు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!