Tamanna: నా మూడ్ బాగలేనప్పుడు అర్ధరాత్రి ఆ హీరోకి కాల్ చేసేదాన్ని: తమన్నా

సౌత్ ఇండియా లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా కచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. ఆమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పదేళ్లు దాటింది. ఈ పదేళ్లలో ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి వచ్చారు. కానీ తమన్నా డిమాండ్ వారి వల్ల ఇసుమంత కూడా తగ్గలేదు. పాలరాతి సొగసు తో అద్భుతమైన అభినయం , డ్యాన్స్ ఇవన్నీ ఒక్క చోట ఉంటే అది తమన్నా అని చెప్పొచ్చు.

తెలుగు లో శ్రీ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన తమన్నా, ఆ తర్వాత తమిళం లో వరుసగా సినిమాలు చేసింది. కానీ ఒక్క సక్సెస్ కూడా రాలేదు , ఆ తర్వాత తెలుగు లో మళ్లీ ‘హ్యాపీ డేస్’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తెలుగు , తమిళం బాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ అతి తక్కువ సమయం లోనే సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఇకపోతే తమన్నా కి ఇండస్ట్రీ లో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. ఈమెకి రామ్ చరణ్ ఇంత మంచి స్నేహితుడు అనే విషయం రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తమన్నా చెప్తే కానీ తెలియలేదు.

ఆమె (Tamanna) పని వత్తిడిలో బాగా స్ట్రెస్ కి లోనై, కాస్త ఆ స్ట్రెస్ నుండి బయటపడడానికి రామ్ చరణ్ కి ఫోన్ చేస్తుందట. ఎంత అర్థ రాత్రి సమయం అయినా అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు రామ్ చరణ్ కి ఫోన్ చేస్తానని, అప్పుడు నాకు ఉన్న స్ట్రెస్ మొత్తం పోయి రిలాక్స్ గా ఉంటానని చెప్పుకొచ్చింది. వీళ్లిద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఉన్న విషయం ఉపాసన కి తెలుసో లేదో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus