సినిమాలను నేనే తగ్గించాను : తమన్నా

  • June 14, 2018 / 11:50 AM IST

మిల్కీ బ్యూటీ తమన్నా జయేంద్ర దర్శకత్వంలో నటించిన నా నువ్వే మూవీ నేడు రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. బాహుబలి చిత్రాల తర్వాత తెలుగులో హీరోయిన్ చిత్రం ఇదే. బాహుబలి సినిమాల తర్వాత అనేక స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం పట్టేస్తుందనుకుంటే.. ఇదివరకు చేసే సినిమాలకంటే తగ్గించింది. హిందీ క్వీన్ రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మి మాత్రమే చేస్తోంది. సవ్యసాచిలో ఓ సాంగ్ చేయనుంది. చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి లో చిన్న రోల్ చేస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కన్నే కలైమానే చిత్రంలో నటిస్తోంది.

అంటే తెలుగులో, తమిళంలో ఒక్కో మూవీ మాత్రమే హీరోయిన్ గా చేస్తోంది. దీనిని బట్టి తమన్నా జోరు తగ్గిందని సినీ విశ్లేషకులు విమర్శిస్తే వాటిని మిల్కీ బ్యూటీ తిప్పికొట్టింది. “కొందరు అనుకుంటున్నట్లు నాకు అవకాశాలు తగ్గలేదు. నా జోరు తగ్గలేదు. అవకాశాలు తగ్గలేదు. నేను 13 ఏళ్లుగా వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా నటిస్తున్నాను. ఇప్పుడు కొంచెం విరామం కోరుకుంటున్నాను” అని  చెప్పింది.  “వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోకుండా, నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించాలని నిర్ణయించుకున్నా. అందుకోసమే నా చేతిలో కొన్ని సినిమాలే ఉన్నాయి” అని తమన్నా సమర్ధించుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus