Tamanna: వైరల్ అవుతున్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు.. అలాంటి వాళ్లంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వచ్చే నెలలో విడుదల కానున్న భోళా శంకర్, జైలర్ సినిమాలలో తమన్నా హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. అయితే తమన్నా చరణ్, నాగ చైతన్యలను పేరెంట్స్ గొప్పగా పెంచారని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. తమన్నా మాట్లాడుతూ సౌత్ యాక్టర్లు సంస్కారవంతులని వాళ్లు గౌరవప్రదంగా ఉంటారని మంచి ప్రవర్తనను కలిగి ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు.

చరణ్, చైతన్యలతో తాను నటించానని ఈ హీరోలను చిరంజీవి, నాగార్జున గొప్పగా పెంచారని తమన్నా కామెంట్లు చేశారు. సెట్ లో ఉన్న మహిళలను చిరంజీవి గారు బాగా చూసుకుంటారని మిల్కీ బ్యూటీ వెల్లడించడం గమనార్హం. చిరంజీవి గారు నేను స్టార్ స్టేటస్ ను అందుకుంటానని నమ్మారని చరణ్ తో సినిమా చేస్తున్న సమయంలో చిరంజీవి ఈ విషయం చెప్పారని తమన్నా పేర్కొన్నారు. తమన్నా చేసిన కామెంట్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి.

తమన్నా రెమ్యునరేషన్ ప్రస్తుతం 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. తమన్నాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమన్నాకు మూడు పదుల వయస్సులో కూడా వరుసగా ఆఫర్లు సొంతం అవుతున్నాయి.

మిల్కీ బ్యూటీ తమన్నా రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదుగుతారేమో చూడాలి. బోల్డ్ సిరీస్ లకు తమన్నా దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తమన్నా ఈ మధ్య కాలంలో నటించిన వెబ్ సిరీస్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటంతో జాగ్రత్త పడాల్సి ఉంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

g>

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus