తమన్నా వారికోసం దేవుడ్ని ప్రార్దిస్తుందట!

  • July 4, 2016 / 11:54 AM IST

ఓ చిత్రాన్ని రూపొందించాలంటే అందులో ముఖ్య పాత్ర పోషించేది నిర్మాతే. సినిమా హిట్ అయితే కోట్లు వచ్చే ఆ నిర్మాతకు ఫ్లాప్ అయితే మాత్రం రోడ్డున పడడం ఖాయం. అలాంటి నిర్మాత గురించి ఎవరు ఎక్కడా.. మాట్లాడరు. పెద్దగా పట్టించుకోరు కూడా.. అయితే హీరోయిన్ తమన్నా మాత్రం తనతో సినిమాలు చేసి నష్టపోయిన నిర్మాతల పట్ల సానుభూతి చూపిస్తోంది.

కథను నమ్మి సినిమా చేస్తాం. అది హిట్ అవుతుందనే ఆశతోనే సినిమా చేస్తాం. కొన్ని సార్లు ఆ అంచనాలు తప్పవుతాయి. ఆ సమయంలో నాకు చాలా బాధ కలుగుతుంది. చిత్ర నిర్మాతలు ఎంతగానో నష్టపోతారు. వారిని చూస్తే నాకు మనస్తాపం కలుగుతుంది. అందుకే నాతో సినిమాలు చేసే నిర్మాతలు మంచి విజయాలను సొంతం చేసుకొని వారికి లాభాలు రావలని దేవుడికి ఎప్పుడు ప్రార్దిస్తూ.. ఉంటానని చెప్పింది తమన్నా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus