రూమర్స్ పై స్పందించిన తమన్నా

  • January 18, 2018 / 05:04 PM IST

హిందీలో హిట్ కొట్టిన ‘క్వీన్’ ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో నీలకంఠ, తమిళ, కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూలు షూటింగ్ ఫ్రాన్స్ లో నిర్వహించారు. అయితే, ముందుగా అనుకున్న బడ్జెట్ ప్లాన్ తేడా కొట్టడంతో, ఈ ప్రాజెక్టు ఆర్థికపరమైన కష్టాల్లో పడిందట. దాంతో ఏదో ఒక భాషలోని రీమేక్ ను ఆపేసే ఆలోచనలో నిర్మాత ఉన్నారనే టాక్ వినిపించింది.

మరి ఈ మ్యాటర్ ఇలా ఎక్కువరోజులు కొనసాగకూడదు అనుకొందో ఏమో కానీ.. తమన్నా ఇమ్మీడియట్ గా స్పందించింది. “సినిమా ఆగిపోయింది” అంటు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని. షూటింగ్ కొద్ది రోజులు ఆగిన విషయం కరెక్టే. అయితే అది కేవలం కథలోని మార్పుల కోసమని, మా అందరికీ నచ్చడంతోపాటు ప్రేక్షకులు కూడా ఆమోదించే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దడం కోసమే ఈవిధంగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది కానీ.. వేరే రీజన్ ఏమీ లేదు. దయచేసి మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఈ ప్రొజెక్ట్ గురించి తప్పుడు ప్రచారాలు చేయకండి, అలా వచ్చే ప్రచారాలు నమ్మకండి అంటూ రిక్వెస్ట్ చేసింది. పాపం పాలుగారే ముద్దుగుమ్మ తమన్నా ఇంతలా అడుగుతున్నందుకైనా జనాలు “క్వీన్”పై ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఉంటారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus