ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు : తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా ‘పాతికేళ్ళ లోపే ఆమె వయసు ఉంటుంది’ అంటే… నమ్మేసేలా ఉంటుంది ఆ బ్యూటీ. పెద్దగా హిట్లు లేకపోయినా… స్టార్ హీరోలందరితోనూ నటించేసింది. పవన్ కళ్యాణ్ తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ , మహేష్ బాబుతో ‘ఆగడు’ , ప్రభాస్ తో ‘రెబల్’ ‘బాహుబలి'(సిరీస్), అల్లు అర్జున్ తో ‘బద్రినాథ్’, రాంచరణ్ తో ‘రచ్చ’, ఎన్టీఆర్ తో ‘ఊసరవెల్లి’.. వంటి అగ్ర హీరోల చిత్రాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తో ‘సైరా నరసింహారెడ్డి’, వెంకటేష్ తో ‘ఎఫ్2’ వంటి చిత్రాల్లో నటించి సీనియర్ స్టార్ హీరోలను కూడా కవర్ చేసేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కుర్ర హీరోయిన్ల రాకతో తమన్నాకి అవకాశాలు చాలా వరకూ తగ్గాయి. అందులోనూ ఈమె ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి.. దర్శక నిర్మాతలను భయపెడుతుంది అనే ప్రచారం కూడా నడుస్తుంది. దాంతో ఈమెకు ‘అవకాశాలు రాకపోవడం వల్లే ఇప్పుడు ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ లో నటిస్తుంది’ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను తమన్నా ఖండించింది.

Tamanna reveals on doing special songs1

ఇటీవల ‘హలో లైవ్ చాట్’ లో పాల్గొన్న తమన్నా ఈ విషయం పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. ప్రత్యేక గీతాల ద్వారా నా ట్యాలెంట్ అందరికీ చూపించగలుగుతున్నాను. అంతేకాదు వీటి వల్ల నేను గతంలో పనిచేసిన స్టార్స్‌తో మళ్ళీ పనిచేసే అవకాశం దక్కుతుంది. నాకు స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. అయితే చాలామంది వేరే కారణాల వల్ల.. నేను స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అలాంటి వారి మాటలను నేను అస్సలు పట్టించుకోను. నాకు నా స్కిల్స్‌ ఇంప్రూవ్ చేసుకోవడం ముఖ్యం” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus