Tamanna: వైరల్ అవుతున్న తమన్నా సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఇండస్ట్రీలో సుధీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో ఒకరు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా యంగ్ జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించిన ఘనత తమన్నాకు దక్కుతుంది. బాహుబలి, బాహుబలి2 సినిమాలు తమన్నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయనే సంగతి తెలిసిందే. అయితే బాహుబలి సినిమాతో నాకు గుర్తింపు రాలేదంటూ ఈ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ బాహుబలి లాంటి సినిమాల వల్ల హీరోలకు మాత్రమే ఎక్కువగా గుర్తింపు వస్తుందని నా ఒపీనియన్ అని ఆమె చెప్పుకొచ్చారు. బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రభాస్, రానాలకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తమన్నా పేర్కొన్నారు. బాహుబలి, బాహుబలి2 సినిమాలలో నటించిన రమ్యకృష్ణ, అనుష్కలకు కొంతమేర మంచి పేరు వచ్చిందని నా రోల్ మాత్రం గెస్ట్ రోల్ గా ఉందని ఆమె కామెంట్లు చేశారు.

ఈ కారణం వల్లే నాకు తగిన ఫేమ్ రాలేదని తమన్నా అన్నారు. ప్రభాస్, రానా బాహుబలి సిరీస్ సినిమాల కోసం ఎంతో కష్టపడ్డారని ప్రభాస్, రానా ప్రశంసలకు అర్హులంటూ మిల్కీ బ్యూటీ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాహుబలి, బాహుబలి2 ఇండస్ట్రీ హిట్లుగా నిలిచినా తన కెరీర్ కు పెద్దగా ఒరిగిందేమో లేదని తమన్నా చెప్పుకొచ్చారు. తమన్నా రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

తమన్నా వరుస ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించడంతో పాటు కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భోళా శంకర్ సినిమాతో తమన్నా మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus