మధ్యలో సల్మాన్ ఖాన్ ఎందుకమ్మా.. తమన్నా..!

  • September 6, 2019 / 06:08 PM IST

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో మొదటి వారం పూర్తయ్యాక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. అలీ, రవి లను టార్గెట్ చేస్తూ ఈమె పలికిన అసభ్యకరమైన మాటలకి ప్రేక్షకులు విసిగిపోయారు. మిడ్ వీకే ఈమెను ఎలిమినేట్ చేయమని సోషల్ మీడియాలో కామెంట్లతో రచ్చ చేశారు. ఓ ట్రాన్స్ జెండర్ ను ‘బిగ్ బాస్’ హౌస్ లోకి పంపించడం అనేది కచ్చితంగా మంచి ఆలోచనే… ఈ విషయంలో షో నిర్వహక్కుల్ని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ ఆమె ప్రవర్తన ఏమాత్రం బాగోలేకపోవడంతో చాలామంది ట్రాన్స్ జెండర్స్ కూడా ఆమెను ఎలిమినేట్ చేసెయ్యమని కోరారు.

ఇక తాజాగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తమన్నా సింహాద్రి మాట్లాడుతూ… ” ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల పైనే ఉంది. సినిమాల్లో నటించి ఆ తరువాత మంచి పొలిటికల్ లీడర్ అనిపించుకోవాలనుంది. సినిమా ఇండస్ట్రీలో అందరూ అని చెప్పడం లేదు కానీ .. కొంతమంది మమ్మల్ని కూడా రమ్మని పిలుస్తారు. నేను వర్జిన్ కాదని.. అబద్దాలు చెప్పడం రాదు. ‘సల్మాన్ ఖాన్ వర్జినైతే.. నేను కూడా వర్జినే’ .! 17 ఏళ్ళ వయసులోనే కన్యత్వాన్ని పోగొట్టుకున్నాను. నేను వర్జిన్ కాకపోయినా.. నా మనసు మాత్రం వర్జినే’ అంటూ చాలా బోల్డ్ కామెంట్స్ చేసింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus