Tamannaah Bhatia: బుల్లితెరపై మిల్కీబ్యూటీ.. ఎలా కనిపిస్తారంటే..?
- June 15, 2021 / 07:37 PM ISTByFilmy Focus
శ్రీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా వరుస విజయాలతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న తమన్నా వెబ్ సిరీస్ లతో కూడా బిజీ అవుతున్నారు. అయితే తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. మరోవైపు బాహుబలి2 తర్వాత తమన్నా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు.
కెరీర్ పరంగా ఆఫర్లతో బిజీగా ఉన్నా సక్సెస్ లేని తమన్నా త్వరలో ఒక వంటల కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని సమాచారం. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ మాస్టర్ చెఫ్ తరహా షోను ప్లాన్ చేయగా ఆ షోకు తమన్నా హోస్టింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వంటల షో చేయడానికి తమన్నా సిద్ధం కావడంతో కొందరు నెటిజన్లు తమన్నా వంటలక్కగా మారబోతున్నారని సోషల్ మీడియాలో సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఈ కార్యక్రమంతో బుల్లితెరపై తమన్నా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే తమన్నా సినిమా ఆఫర్లు వస్తున్న సమయంలో వెబ్ సిరీస్ లకు, బుల్లితెరకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తమన్నా ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ట్రో సినిమాలో నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సీటీమార్, ఎఫ్3 సినిమాల్లో తమన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే తమన్నాకు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!












