మిల్కీ బ్యూటీ తమన్నా యాక్టింగ్‌తో కంటే ఎక్కువగా గ్లామర్ తో అంతకంటే ఎక్కువగా తన డ్యాన్స్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందువల్ల స్పెషల్ సాంగ్స్‌కు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే తన డ్యాన్సింగ్ స్కిల్స్ ఇంతలా ఇంప్రూవ్ అవ్వడం వెనుక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడని, ఆయన ఇచ్చిన ఒకే ఒక్క సలహా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యిందని తమన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ… “నేను చాలా సినిమాల్లో డ్యాన్స్ చేశాను. కానీ ‘బద్రినాథ్’ టైమ్‌లో అల్లు అర్జున్ నన్ను చాలా పుష్ చేశారు. ‘నువ్వు ఇంకా టఫ్ స్టెప్స్ చేయగలవు, నాతో సమానంగా ఫైర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి’ అంటూ పట్టుబట్టారు. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో నేను కొరియోగ్రాఫర్‌తో మాట్లాడి, ఎంతో కష్టమైన మూమెంట్స్‌ను ప్రాక్టీస్ చేసేదాన్ని” అని చెప్పుకొచ్చింది.
ఆ సినిమా తర్వాతే తనకు డాన్స్ పరంగా విపరీతమైన గుర్తింపు వచ్చిందని, వరుసగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు వెల్లువెత్తాయని తమన్నా తెలిపింది. తన డ్యాన్సింగ్ కెరీర్‌కు పునాది వేసిన అల్లు అర్జున్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం బన్నీ పాన్-ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఇక తన సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం హిందీలో ‘రోమియో’, ‘రేంజర్’ వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
2024లో తమిళ కామెడీ-హారర్ ‘అరణ్మనై 4’లో సెల్విగా మెప్పించిన తమన్నా, 2025లోనూ విభిన్న ప్రాజెక్టులతో అలరించింది. తెలుగు సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల 2’లో శివ భక్తురాలిగా, హిందీ ‘రైడ్ 2’లో నషా పాటలో, అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘డూ యూ వానా పార్టనర్’లో క్రాఫ్ట్ బీర్ వ్యాపారవేత్తగా నటించి తన మార్క్ చూపించింది.