Tamannaah: సుర సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్నా!

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్న నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన భోళా శంకర్ సినిమా కూడా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా ఈమె నటించిన ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తమన్నా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినీ కెరియర్ గురించి అలాగే తన సినిమాల గురించి పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Tamannaah) తమన్న తన సినీ కెరియర్లో ఈమె నటించిన ఒక సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కోలీవుడ్ హీరో విజయ్ తలపతి తమన్నా నటించిన చిత్రం సుర. ఈ సినిమా మ్యూజికల్ గా ఎంతో అద్భుతమైన విజయం అందుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం విజయ్ కెరియర్ లోనే డిజాస్టర్ సినిమాగా నిలిచిపోయింది.

ఈ సినిమా గురించి తమన్న మాట్లాడుతూ ఈ సినిమాలో తన నటన తనకే నచ్చలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని తెలిపారు. ఇలా సినిమా షూటింగ్ సమయంలోనే సినిమా పరిస్థితి ఏంటి అనే అంచనాకు రావచ్చు కానీ ఒక సినిమాకు కమిట్ అయిన తర్వాత నటీనటులుగా తాము ఆ సినిమాని పూర్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంటుందని తెలిపారు.

ఇక సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత జయపజయాలతో సంబంధం ఉండదు. సినీ ఇండస్ట్రీ చాలా విలువైనది కనుక ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా తమన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus