Tamannaah: ఫేవరెట్‌ హీరోయిన్‌ దగ్గరికొచ్చిన సంపత్‌ నంది… ఈసారి ఏమవుతుందో?

కొంతమంది దర్శకులుకు హీరోయిన్లు ఫేవరేట్‌గా ఉంటారు. వాళ్లతో సినిమా అంటే హిట్‌ గ్యారెంటీ అంటుంటారు. అలాంటి కాంబినేషన్‌లో సంపత్‌ నంది – తమన్నా ఒకటి. ఇద్దరూ కలసి ఇప్పటికి మూడు సినిమాలు చేశారు. అన్నీ మంచి విజయమే అందుకున్నాయి. హ్యాట్రిక్‌ కొట్టిన వీరిద్దరూ ఇప్పుడు మరో సినిమాకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి సంపత్‌ నంది నిర్మాత మాత్రమే. అలాగే కథ కూడా అందిస్తున్నారు. హెబా పటేల్‌ ప్రధాన పాత్రలో 2022లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమా గుర్తుందా.

కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో క్రైం థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆహా ఓటీటీలో నేరుగా వచ్చిన ఈ పిక్చర్‌ మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు. ‘ఓదెల 2’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశం ఇటీవల ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం కాశీలో తెరకెక్కించారు. వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తునన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలో తెలియజేస్తారట.

తొలి సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించిన సంపత్‌ నంది ఈ సారి నిర్మాతగా కూడా మారారు. ఈ సినిమాను అశోక్‌ తేజ తెరకెక్కిస్తున్నారు. ‘కాంతార’ చిత్రానికి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అందించిన అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఓ గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలను చూపించే కథ ఇది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలను ఈ సినిమాలో చూపిస్తారట. ఇక ‘ఓదెల రైల్వే స్టేషన్’ కథ చూస్తే…

అనుదీప్ (సాయి రోనక్) సివిల్స్ టాపర్. ఐఏఎస్ వద్దని మరీ ఐపీఎస్ తీసుకుంటారు. పోస్టింగ్‌కు ముందు మూడు నెలల ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. అక్కడ కొత్త పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది దీంతో సినిమా మొదలవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి మర్డర్ చేస్తాడు. ఆ తర్వాత అదే విధంగా మరో మూడు హత్యాచారాలు జరుగుతాయి. మరి ఆ హంతకుడు అనుదీప్‌కు దొరికాడా? లేదా? అనేదే కథ.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus