ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తరువాత స్టార్ డమ్, స్టార్స్ ప్రభావం తగ్గిందని చెబుతోంది నటి తమన్నా. ఏడెనిమిదేళ్ల క్రితం తనకు స్టార్ డమ్ వచ్చినప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవని.. ఔత్ లో అభిమానగణం ఎక్కువ అని.. ఏళ్లుగా స్టార్స్ ను అభిమానిస్తుంటారని చెప్పుకొచ్చింది. కానీ ఓటీటీ వచ్చిన తరువాత స్టార్ డమ్ మసకబారిందని.. హీరోయిజం తగ్గిందని అంటోంది. సినిమాలతో పోలిస్తే.. ఓటీటీలో పోటీ ఎక్కువ ఉందంటోంది తమన్నా. ఓటీటీలలో చాలా స్టఫ్ ఉంటోందని..
పైగా చాలా ఫాస్ట్ గా ట్రెండ్స్ మారిపోతుంటాయని అంటోంది. ఓటీటీలో నటీనటులకు ఎప్పుడూ టాప్ లో ఉండడం అవసరమని.. ప్రతీసారి మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతోంది. ఓటీటీల కంటెంట్ కి సంబంధించి అప్డేటెడ్ గా ఉండనై.. నటులుగా ఎప్పటిట్రెండ్స్ అప్పటికి తెలుసుకుంటూ ఉండాలని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు హీరోలంటే ఇలానే ఉండాలి.. హీరోయిన్లు ఇలానే కనిపించాలనే కొలతలు, లెక్కలు ఉండేవని.. కానీ ఓటీటీ వచ్చిన తరువాత కథలు, హీరోహీరోయిన్లు క్యారెక్టరైజేషన్లు మారిపోయాయని అంటోంది ఈ బ్యూటీ.
ఓటీటీలో హీరో, హీరోయిన్ అనే కాన్సెప్ట్ కూడా లేదని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?