Vijay Antony: విజయ్ క్షేమంగా ఉన్నాడు… అవన్నీ అవాస్తవమే!

కోలీవుడ్ యాక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సీక్వెల్ సినిమా షూటింగ్లో భాగంగా మలేషియాలో ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈయన బోటులో ప్రయాణిస్తున్న సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా బోటు అదుపుతప్పి కెమెరాలు ఉన్న మరొక బోటును ఢీకొట్టడంతో నటుడు విజయ్ గాయాలు పాలయ్యారని వార్తలు వచ్చాయి. ఆసుపత్రికి తరలించి అనంతరం చెన్నై తీసుకువచ్చారని తెలుస్తోంది. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని

ఈయనకు సర్జరీ కూడా నిర్వహించాల్సి ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా ఈయన కోమాలోకి కూడా వెళ్లే సూచనలు ఉన్నాయంటూ వార్తలు రావడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విజయ్ క్షేమంగా తిరిగి కోలుకోవాలని అభిమానులు కూడా ప్రార్థించారు. ఇలా విజయ్ ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై సన్నిహితులు స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ సన్నిహితులు తన ఆరోగ్యం పై మాట్లాడుతూ

విజయ్ ఆంటోనీ ఆరోగ్యం గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని అవన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేశారు. ఆయనకు ఎలాంటి సర్జరీలు జరగలేదని తాను కోమాలోకి వెళ్లే పరిస్థితులలో లేరని తన సన్నిహితులు వెల్లడించారు. బుధవారం సాయంత్రం విజయ్ చెన్నై చేరుకున్నారని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందని తన పనులు అన్నింటిని తానే చేసుకుంటున్నారని,

ప్రస్తుతం విజయ్ బిచ్చగాడు సీక్వెల్ సినిమా పనులలో బిజీగా ఉన్నారంటూ ఆయన సన్నిహితులు తన ఆరోగ్యం గురించి వస్తున్న పద్ధతులపై స్పందించి వాటిని కొట్టి పారేశారు.ఇలా విజయ్ ఆంటోనికి ఎలాంటి ప్రమాదం లేదు క్షేమంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus