ఉరి వేసుకొని మరణించిన వర్ధమాన నటీమణి

కొలీవుడ్‌కు చెందిన వర్దమాన సినీ తార రియామికా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నైలో బుధవారం చోటుచేసుకుంది. వలసారవాకంలోని తన నివాసంలో నటి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆమె వ‌య‌సు 26 సంవ‌త్స‌రాలు. కుద్రతైల్ కుమారాం కొందత్తం, అఘోరి యనిట్టం ఆరంభం సినిమాల్లో కథానాయికిగా న‌టించింది. ఎపిలోని కుప్పానికి చెందిన రియామిక, తన సోదరుడు ప్రకాశ్‌తో కలిసి గత నాలుగు నెలలుగా చెన్నైలోని వలసారవాకంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి రియామికను చివరిసారిగా మంగళవారం ఉదయం కలిసినట్టు ప్రకాశ్ తెలిపాడు. అదే రోజు బయటకు వెళ్లిన ప్రకాశ్, తన సోదరికి బుధవారం అనేక సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో భయపడిన ప్రకాశ్ ఆమె స్నేహితుడు దినేశ్‌ను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడని పేర్కొన్నాడు.

బుధవారం సాయంత్రం ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తన దగ్గర మరో తాళం చెవితో ప్రకాశ్ తలుపు తెరిచి చూడగా రియామిక తన బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రోయాపెటా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus