Varasudu Movie: ఆ తప్పు జరగకుండా దిల్ రాజు జాగ్రత్త పడతారా?

సంక్రాంతి కానుకగా సౌత్ ఇండియాలో మొదట విడుదలవుతున్న సినిమాలలో వారసుడు సినిమా ఒకటి. విజయ్ నటించిన ఈ సినిమా తమిళంలో వారిసు పేరుతో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు కొన్ని తమిళ వెబ్ సైట్లు కూడా షాకిచ్చాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందే వారసుడు రొటీన్ మూవీ అని కొన్ని తమిళ వెబ్ సైట్లు ప్రచారం చేస్తున్నాయి. తెలుగులో వినిపించిన కామెంట్లే తమిళంలో వారిసు రిలీజ్ కు ముందు వినిపించాయి.

అయితే ఈ ప్రచారానికి చెక్ పెట్టే దిశగా దిల్ రాజు జాగ్రత్త పడాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వారిసు మూవీ దిల్ రాజు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ రెమ్యునరేషన్ ఏకంగా 110 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ కు సైతం ఈ సినిమా సక్సెస్ కీలకం కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవాలని అభిమానులు భావిస్తున్నారు.

వారసుడు సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తమిళ ప్రేక్షకులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దిల్ రాజుకు తమిళంలో ఈ సినిమా సక్సెస్ తో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను మొదలుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారిసు, తునివు సినిమాలు బాక్సాఫీస్ కు శుభారంభాన్ని ఇవ్వాలని తమిళనాడు ప్రేక్షకులు భావిస్తుండటం గమనార్హం.

తెగింపు సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తమిళ సినిమాలకు భారీ షాక్ తప్పదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తెగింపు, వారసుడు సినిమాలు ఎన్ని థియేటర్లలో విడుదల కానున్నాయో క్లారిటీ రావాల్సి ఉంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus