RRR Movie: జక్కన్న దోస్తీ వాళ్లకు నచ్చలేదా?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సిరీస్ ను మించి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా కచ్చితంగా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జక్కన్న ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచడంతో రిలీజ్ డేట్ మారే అవకాశాలు అయితే లేవని అర్థమవుతోంది.

ఈ నెల 1వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి దోస్తీ సాంగ్ విడుదలై అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తమిళంలో మాత్రం ఈ సాంగ్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తెలుగులో ఈ పాటకు కోటిన్నర వ్యూస్ వస్తే తమిళంలో కేవలం 49 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇతర వెర్షన్లతో పోలిస్తే తమిళంలోనే తక్కువ వ్యూస్ రావడంతో తమిళులు ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి కనెక్ట్ కాలేదా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో సముద్రఖని మినహా తమిళులు ఎవరూ నటించడం లేదు. ఈ రీజన్ వల్లే తమిళంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడలేదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్ద మార్కెట్ అయిన తమిళంలో ‘ఆర్ఆర్ఆర్’పై అంచనాలు మరింత పెరిగేలా జక్కన్న ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు కూడా తమిళంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ లేదనే సంగతి తెలిసిందే.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus