ఈ మధ్య కాలంలో పాత సినిమాల నిర్మాతలు, రచయితలు, దర్శకులు … ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇప్పటి సినిమాల పై, వాటి ఫలితాల పై లేదా దర్శకుల పై సంచలన కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఉన్నారు. ఆయన లేటెస్ట్ సినిమాల పై చేస్తున్న ఘాటు విమర్శలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈయన విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన లైగర్ చిత్రం పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ పై ఆయన మాట్లాడుతూ..”ఎవరు ఎగిరెగిరి పడొద్దు. దేశాన్ని తగలెడదాం.. ఊరుని తగలెడతాం అని అంటే మనల్ని తగలెడతారు. కష్టపడ్డాను, సినిమా చూడండి బాబు అని చెబితే పద్ధతిగా బాగుంటుంది. నువ్వు చిటికేస్తే వాళ్లు చిటికేస్తారు. నేను పూరి జగన్నాథ్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. కానీ ఆయన డైరెక్ట్ చేసిన లైగర్ సినిమాను చూడాలని ఎందుకనో నాకు అనిపించలేదు. సినిమాను బాయ్‌కాట్ చేయడానికి వాళ్లెవరు.
అలా పోస్ట్ పెట్టేవాడు సినిమాను చూస్తాడనే గ్యారంటీ ఉందా!. అసలు నువ్వు ఎన్ని సినిమాలు చూశావు బాయ్‌కాట్ చేయటానికి అని అడగాలి. ఏదో పనీ పాట లేనివాళ్లు అలాంటి పనులు చేస్తుంటారు. సోషల్ మీడియాపై ఆధారపడుతూ ఆ లైకులు, డిస్ లైకులు చూసుకునే బతుకులు మనవి అయ్యాయి.ఒకప్పుడు సంపాదనతో కడుపు నింపటం ఎలా అని ఆలోచించేవారు ఇప్పుడు లైకులతో కడుపులు నింపుకుంటున్నారు. వాటి కోసమే బతుకుతున్నారు.
సినిమా బావుంటే బాయ్‌కాట్ చేయమన్నా చేయరు. అదే బాగోలేదనుకోండి.. సినిమా థియేటర్స్‌కు జనాలను రమ్మన్నా రారు. సినిమా ఇండస్ట్రీలో 5 శాతమే సక్సెస్ ఉంది. 95 శాతం సినిమాలు ఆడటం లేదు. అందులో 70 శాతం మంది నిర్మాతలు తిండికి లేక ఇబ్బంది పడే పరిస్థితికి చేరుకుంటున్నారు. ఇక లైగర్ ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడబుద్ది కాలేదు. బహుశా భవిష్యత్తులో చూస్తానేమో ” అంటూ చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!