చిరంజీవికి జాకీలు అవసరం లేదు: తమ్మారెడ్డి

టాలీవుడ్‌లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. అవతల ఉన్న వ్యక్తి చిన్నవాడా, పెద్ద వాడా, స్టార్‌, సూపర్‌ స్టారా అనేది చూడకుండా మనసులో మాటను బయటపెట్టేస్తుంటారు. అలాంటి అతికొద్ది మందిలో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఇండస్ట్రీలో ఏం జరిగినా.. తన అభిప్రాయాన్ని బల్ల గుద్ది మరీ చెబుతారు ఆయన. అలా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి, నాగబాబు గురించి ఓపెన్‌గా మాట్లాడారు. నాగబాబు మాట్లాడకపోతే మంచిది అని కూడా అన్నారు తమ్మారెడ్డి.

సోషల్ మీడియాలో చిరంజీవి, బాలకృష్ణ‌ గురించి ఏవేవో మాట్లాడుతుంటారు. చిరంజీవికి మార్కెట్ త‌గ్గిపోయింద‌ని, సినిమాలో ప‌క్క‌న మ‌రో హీరో ఉండాల్సిందే అనే కామెంట్స్‌ కొంతమంది చేస్తున్నారు. నాకు తెలిసి ఇండస్ట్రీలో చిరంజీవి 1 నుండి 10. ఇంత‌కుముందు రామారావు, నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ‌, శోభ‌న్‌బాబు లాంటి హీరోలు కాస్త డీలా పడ్డారు. కానీ కొద్ది రోజులకే మళ్లీ స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. బాలకృష్ణ‌ నాలుగేళ్ల ముందు కొన్ని రోజులు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి చూశారు అంటూ తన విశ్లేషణ చెప్పారు తమ్మారెడ్డి.

ఇండస్ట్రీలో నటనను మానేయమని ఎవరూ చెప్పలేం, సినిమాలు ఆపేయమని ఎవరూ అనలేరు. వాళ్లంత‌ట వాళ్లు మానేస్తే చెప్ప‌లేం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవ‌రి స్థానం వాళ్ల‌కు ఉంటుంది. చిరంజీవిని ఎవ‌రో వ‌చ్చి ప్రత్యేకంగా జాకీ పెట్టి లేపాల్సిన అవసరం లేదు. ఆయ‌న ఫాలోయింగ్, రెవెన్యూ ఆయ‌న‌కు ఉన్నాయి. ప్రత్యేకంగా ఎవరో ఉంటే ఆయన సినిమా ఆడుతుంది అనే పరిస్థితి లేదు అని అన్నారు తమ్మారెడ్డి.

‘‘నాగ‌బాబు ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఎవ‌రో చిరంజీవి గారికి రెడ్ కార్పెట్ ప‌రిచారు. త‌ర్వాత త‌క్కువ‌గా మాట్లాడారు అన్నారు. నాకు తెలిసి చిరంజీవి ఇలాంటి కొన్ని విష‌యాల‌ను ప‌ట్టించుకోరు. తన కెరీర్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఎన్నో దాటుకుని వచ్చారు. అయినా అలాంటి వ్య‌క్తి గురించి మాట్లాడుకోవ‌టం సరికాదు, అవసరమూ లేదు అని అన్నారు తమ్మారెడ్డి. అంతేకాదు అలాంటి విష‌యాల‌ను నాగబాబు మాట్లాడ‌క‌పోతేనే మంచిది. చిరంజీవి గౌర‌వం ఇంకా పెరుగుతుంది తన ఆలోచన చెప్పారు తమ్మారెడ్డి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus