టాలీవుడ్‌లో ఏదైనా సమస్యను ప్రస్తావించడానికి, దేని మీదైనా ప్రశ్నించడానికి ముందుండే వారిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన తమ్మారెడ్డి తాజాగా ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ చర్చ గురంచి మాట్లాడారు. అంతేకాదు ‘అప్పుడేమైపోయారు మీరంతా’ ప్రశ్నించారు. దాంతోపాటు ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ ప్రచారం కోసం మాట్లాడితే ముందుకొచ్చినోళ్లు ఇప్పుడేమయ్యారు అంటూ ప్రశ్నించారు. ‘‘మీ కుటంబాల్ని కాపాడుకునే ధైర్యం మీకు లేదు. మీ ఇంట్లో వాళ్లను తిడితే సిగ్గుపడటం లేదు.
మీరే పిరికి వాళ్లు… నేను కాదు’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు (Tammareddy) తమ్మారెడ్డి. బయటకు వచ్చినప్పుడు సెక్యూరిటీలు పెట్టుకుని షో చేయటం కాదు. ముందు మనల్ని మనం కాపాడుకునే శక్తి ఉండాలి అంటూ సూచించినట్లు సూచించి ఇండస్ట్రీ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు తమ్మారెడ్డి. ఈ క్రమంలో తనపై గతంలో విమర్శలు చేసిన సినిమా వాళ్లపై కూడా విమర్శలు గుప్పించారు. అయితే ఈ క్రమంలో ఎవరి పేరూ ఆయన ప్రస్తావించలేదు.
కొన్నాళ్ల క్రితం ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే సినిమా వాళ్ల ఇంట్లో ఆడవాళ్ల గురించి ఏదేదో మాట్లాడారు. అందరూ చెడిపోయినోళ్లు అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాంతో మమ్మల్ని ఇలా అంటారా? అని నేను చాలాసార్లు ప్రశ్నించాను. కానీ ఇండస్ట్రీ నుండి ఎవరూ మాట్లాడట లేదు. అసలు ఈ మొగోళ్లంతా అప్పుడేం చేస్తున్నారు. ఒక్కరూ మాట్లాడలేదేం అని ప్రశ్నించారు తమ్మారెడ్డి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను నేను ఏదో అన్నాను అంటూ ఇండస్ట్రీ జనాలు మాట్లాడారు. మరి వీళ్లంతా అప్పుడేం మాట్లాడలేదు.
రాజకీయ నాయకులు అలా మాట్లాడుతుంటే ఎవరూ మాట్లాడలేదు ఎందుకు.. భయపడ్డారా? అంటూ ప్రశ్నించారు తమ్మారెడ్డి. నన్ను ఛాలెంజ్ చేసిన మగాళ్లు అప్పుడు ఏమయ్యారు అంటూ మరోమారు ప్రశ్నించారు తమ్మారెడ్డి. మరి తమ్మారెడ్డి మాటలకు ఎవరు సమాధానం చెబుతారో చూడాలి. అన్నట్లుగా ఈ విషయంలో ఓ మీడియాకు చెందిన వ్యక్తి కూడా ఇంచుమించు ఇలానే మాట్లాడారు. మరి ఆ విషయాన్ని తమ్మారెడ్డి ప్రస్తావించడం మరచిపోయారేమో.