Project K: ప్రభాస్ వల్ల కాకపోతే మహేష్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?

స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఏదనే ప్రశ్నకు ప్రాజెక్ట్ కే సినిమా పేరు సమాధానం వినిపిస్తుంది. ఈ సినిమాలో నటీనటుల రెమ్యునరేషన్ల కోసమే 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రభాస్ కెరీర్ లో బడ్జెట్ విషయంలో ప్రాజెక్ట్ కే అత్యంత రిస్కీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళతారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

ప్రముఖ దర్శకనిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ తాజాగా ప్రాజెక్ట్ కే సినిమా గురించి మాట్లాడుతూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. తమ్మారెడ్డి భరద్వాజ తన కామెంట్లతో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారనే చెప్పాలి. మొదట భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించిన పలు సినిమాల పేర్లను చెప్పిన తమ్మారెడ్డి ఒకప్పుడు తెలుగులో రూ.30 కోట్లు, రూ.40 కోట్లు వస్తే చాలా ఎక్కువని అనుకున్నాం అని వెల్లడించారు.

ఇంద్ర సినిమాకు 30 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే మీ రేంజ్ కు 100 కోట్ల రూపాయలు రావాలని చిరంజీవితో అన్నానని తమ్మారెడ్డి తెలిపారు. తెలుగులో 100 కోట్ల రూపాయల కలెక్షన్లు ఎలా వస్తాయని అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. బాహుబలి2 సినిమాతో 1000 కోట్లు సులువుగా సాధించవచ్చని రాజమౌళి ప్రూవ్ చేశారని తమ్మారెడ్డి అన్నారు. మనం వరల్డ్ రికార్డ్ సినిమా లెవెల్ కు వెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

ఫ్లాప్ సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్లు సాధిస్తున్నాయని తమ్మారెడ్డి తెలిపారు. (Project K) ప్రాజెక్ట్ కే సినిమాను సరిగ్గా ప్రొజెక్ట్ చేస్తే వరల్డ్ టాప్ సినిమాలలో ఈ సినిమా చేరుతుందని ఆయన అన్నారు. ఈ సినిమా సెట్స్ కు వెళ్లానని ఈ సినిమా గ్లోబల్ గా రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమా తప్పితే మహేష్ రాజమౌళి సినిమా ఆ రికార్డ్ సాధిస్తుందని ఆయన అన్నారు.

10,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాలు కలెక్షన్లను సాధించాలని తమ్మారెడ్డి తెలిపారు. సరిగ్గా ప్రమోషన్స్ చేస్తే ప్రాజెక్ట్ కే సినిమా తొలిరోజే 500 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus