Adipurush: ఆదిపురుష్ సినిమాపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లను సాధిస్తోంది. అయితే ఈ సినిమాపై వివాదాలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఆదిపురుష్ సినిమాకు సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ రివ్యూ ఇచ్చారు. రామాయణం మన అందరికీ తెలిసిన కథ అని ఆయన కామెంట్లు చేశారు.

మన దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా చూసుకునే గ్రంథం రామాయణం అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. రామాయణంలోని పాత్రలు, ఆ పాత్రల స్వభావాలు ప్రజల మదిలో ఆరాధించే విధంగా ఉన్నాయని తమ్మారెడ్డి అన్నారు. అలాంటి పాత్రలను వక్రీకరించి సినిమా తెరకెక్కించడం తప్పు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ చెప్పిన విషయాలు నిజమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ (Adipurush) సినిమాకు సంబంధించి చేసిన పొరపాట్లు చిన్నచిన్న పొరపాట్లే కాగా ఆ పొరపాట్లు ఈ సినిమా రిజల్ట్ పై చాలా ప్రభావం చూపాయి. అయితే త్రీడీలో తెరకెక్కడం వల్ల ఈ సినిమాకు నష్టాలు మాత్రం తగ్గాయనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సినిమాపై వివాదాలు ఎప్పటికి ఆగుతాయో చూడాల్సి ఉంది. ప్రభాస్ ఈ సినిమా ఫలితం గురించి స్పందించి ఉంటే బాగుండేదని కొంతమంది చెబుతున్నారు.

ప్రభాస్ స్పందిస్తే ఆ కామెంట్లను కూడా కొంతమంది వివాదాస్పదం చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆదిపురుష్ సినిమాలో పాత్రల స్వభావాలను మార్చేసి ప్రజల మనోభావాలను దెబ్బ తీయడం తప్పు అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. తమ్మారెడ్డి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus