త్వరలోనే ఇల్లాలు కాబోతున్న తాప్సీ!

నిప్పు లేనిదే పొగ రాదనేది ఎంత సత్యమో.. ఎటువంటి అనుమానం లేకుండా గాసిప్స్ పుట్టవనేది అంతే సత్యం. ఇప్పుడు పుట్టిన రూమర్ ఏమిటంటే తాప్సి రహస్యంగా నిశ్చితార్ధం చేసుకుందని. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగువారికి పరిచయమైన ఈ బ్యూటీ ప్రభాస్, రవితేజ వంటి హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఎంత కష్టపడ్డప్పటికీ బ్రేక్ రాకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి పేరుతెచ్చుకుంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి చేసిన పింక్ సినిమా తాప్సి కెరీర్ ని పరుగులు పెట్టించింది. ఆ తర్వాత  తెలుగులోనూ ఆనందో బ్రహ్మ వంటి విజయాన్ని అందుకుంది. ఈ బ్యూటీ ఇటీవల బాడ్మింటన్‌ స్టార్‌ మాథ్యూస్‌తో ప్రేమలో పడిందన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

రీసెంట్ గా తాప్సీ తన లవర్‌ మాథ్యూస్‌తో కలిసి గోవాకి వెళ్లినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇద్దరు మాత్రమే వెళితే విహారానికి అని సరిపెట్టుకోవచ్చు. వారిద్దరే కాకుండా వారితో తాప్సి పేరెంట్స్, బంధువులు కూడా వెళ్లినట్లు సమాచారం. అక్కడే ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే తాప్సి ప్రస్తుతం సైన్ చేసిన సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే తాప్సి స్పందించాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus