బుచ్చిబాబుకు క్లారిటీ వచ్చేది ఆరోజేనా?

సాధారణంగా స్టార్ హీరోలు ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. ఫ్లాపుల్లో ఉన్న దర్శకునికి ఛాన్స్ ఇచ్చి సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రభావం దర్శకుని కెరీర్ తో పాటు హీరో కెరీర్ పై పడుతుందనే సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కెరీర్ తొలినాళ్ల నుంచి రిస్క్ తీసుకుంటూనే విజయాలను అందుకుంటున్నారు. ఆచార్య సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోకపోయినా తారక్ కొరటాల శివ డైరెక్షన్ లోనే నటించనున్నారు.

జనతా గ్యారేజ్ మూవీతో తారక్ కొరటాల శివ లోకల్ గా రిపేర్లు చేయగా భవిష్యత్తు ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా హిట్ సాధించాలని తారక్, కొరటాల శివ భావిస్తున్నారు. ఆచార్య విషయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతూ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తారక్ 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుండగా తారక్ 31వ సినిమాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ తెరకెక్కనుంది.

గతేడాది ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలతో పాటు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథకు కూడా తారక్ ఓకే చెప్పారని ప్రచారం జరిగినా ఎన్టీఆర్ వైపు నుంచి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే మే 20వ తేదీన తారక్ పుట్టినరోజు కావడంతో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో తారక్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తారో లేక సర్ప్రైజ్ ఇస్తారో చూడాల్సి ఉంది. కొరటాల శివ సినిమాకు 55 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారక్ ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రెమ్యునరేషన్ పెంచనున్నారని తెలుస్తోంది. తారక్ భవిష్యత్తు ప్రాజెక్టులలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు కూడా ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus