అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తున్న తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి పోస్ట్..

నందమూరి తారక రత్న మరణించి 3 వారాలకు పైగానే అవుతుంది.. కానీ నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు.. ముఖ్యంగా ఆయన భార్య, బిడ్డల పరిస్థితి అయితే అందర్నీ కలచి వేస్తోంది.. అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.. తమ ప్రేమకు గుర్తుగా బంగారంలాంటి ముగ్గురు పిల్లలనిచ్చి.. తమతో కలిసి ఉండకుండా అనాధలను చేసి వెళ్లిపోయాడంటూ ఆమె పడుతున్న బాధ అయితే వర్ణనాతీతం..

తారక రత్న పిల్లలు ముగ్గురు చాలా చిన్న వాళ్లు. భవిష్యత్తులోనే వాళ్లకి తండ్రి ప్రేమ, రక్షణ అనేది ఎక్కువ అవసరం. కానీ విధి మాత్రం ఆ చిన్నారులపై ఏ మాత్రం జాలి, దయచూపకుండా తండ్రిని దూరం చేసి.. ఆ కుటుంబానికి తీరని దు:ఖాన్ని మిగిల్చింది. అయితే ఇంతటి విషాదంలోనూ కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే.. తారక్ బాబాయ్ బాలకృష్ణ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. పెద్ద దిక్కుగా మారి వారి బాగోగులు చూసుకుంటున్నారు.

ఇక తారక రత్న అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి బాలయ్యే.. కంటికి రెప్పలా వారిని చూసుకున్నారు. బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చాడు. ముందు నుంచి తారక రత్న- బాలయ్యల మధ్య మంచి అనుబంధం ఉంది. తాజాగా అలేఖ్య రెడ్డి బాలకృష్ణ తమ కుటుంబానికి చేసిన సాయం, ఆపదవేళ ఆయన నుంచి లభించిన మద్దతును తలుచుకుంటూ ఇన్‌స్టా వేదికగా చేసిన ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్ అవుతోంది..

‘‘మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి.. మంచి, చెడు ఏదైనా కానీ.. అవి పూర్తిగా సమసిపోయే వరకు రాయిలా మాకు అడ్డు నిలబడ్డ వ్యక్తి, ఆస్పత్రికి తీసుకువెళ్లే వేళ తండ్రిలా, నీ బెడ్‌ పక్కనే కూర్చొని నీ కోసం పాట పడినప్పుడు అమ్మలా, నిన్ను నవ్వించడం కోసం జోక్‌లు వేస్తూ.. సరదగా కనిపించి.. ఎవరు చూడనప్పుడు నీ కోసం కన్నీరు పెట్టుకున్న బాంధవుడు..

అన్ని వేళలా ఆయన మన వెంటే ఉన్నారు. నువ్వు ఇంకా కొంత కాలం మాతో ఉండుంటే బాగుండేది ఓబు (తారక రత్న).. మేం నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం.. ఒరిజనల్‌ ఫోటోలో ఓబును మార్ఫింగ్‌ చేసిన వాళ్లుకు థ్యాంక్స్. వారు చేసిన ఎడిటింగ్‌ ఎంతో అందంగా ఉంది’’ అంటూ బాలయ్య బాబు తమ పిల్లలతో కలిసి దిగిన బ్యూటిఫుల్ పిక్ షేర్‌ చేశారు అలేఖ్య రెడ్డి..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus