తారకరత్న ప్రమాదం నుండి అయితే బయటపడ్డారు కానీ.. ఇంకా స్పృహలోకి వచ్చింది లేదు. గత వారం రోజులుగా ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో స్పృహ లేకుండా పడి ఉన్నారు. మొదట ఆయన అవయాలు పనిచేయలేదు. కానీ ఈ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత.. మెరుగైన చికిత్స అందించిన తర్వాత అవయవాల పనితీరు మెరుగుపడింది. యూరిన్, మోషన్ వంటివి అవుతున్నాయట. అయితే మెదడు పనితీరు ఏమాత్రం పికప్ అవ్వలేదు అని తెలుస్తుంది.
తారకరత్న బ్రతికే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ గుండెపోటు వచ్చే ముందు ఏదో షాక్ కు గురైనట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో తారకరత్న మెదడుకి స్కానింగ్ తీసి ఆ రిపోర్ట్ ను విదేశాలకు పంపిస్తారు. విదేశాల్లో ఉన్న వైద్యులు చెప్పినదాన్ని బట్టి.. తారకరత్నను విదేశాలకు షిఫ్ట్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతానికి తారకరత్న భార్య పిల్లల కంటే కూడా నందమూరి బాలకృష్ణ హాస్పిటల్ వద్ద ఎక్కువగా ఉంటూ తారకరత్న హెల్త్ కండిషన్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారట.
మరోపక్క తారకరత్న తిరిగి క్షేమంగా రావాలని ఆయన మృత్యుంజయ ఆలయంలో పూజలు వంటివి చేయిస్తున్నారు. జనవరి 27న చిత్తూరులోని కుప్పంలో నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు.. అదే సమయంలో ఆయన సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. దీంతో కుప్పంలో ఉన్న ఓ హాస్పిటల్ లో అతన్ని అడ్మిట్ చేస్తే పరిస్థితి క్రిటికల్ గా మారింది. దీంతో తారకరత్నను బెంగళూర్ నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!