Tasty Teja: ఆ ప్రశ్నను అడగొద్దని టేస్టీ తేజ చెప్పడానికి కారణాలివేనా?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన టేస్టీ తేజ తాజాగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. టేస్టీ తేజ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆట సందీప్ ఇప్పటికే టేస్టీ తేజపై సెటైర్లు వేయగా ఆ సెటైర్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. తేజ ఎలిమినేట్ అవుతున్నాడని తెలిసిన వెంటనే సందీప్ ఎగిరి గంతేశారనే సంగతి తెలిసిందే. అందరినీ ఎలిమినేట్ చేస్తున్న టేస్టీ తేజ చివరకు తనే ఎలిమినేట్ అయ్యాడంటూ ఆట సందీప్ సెటైర్లు వేశారు.

అయితే టేస్టీ తేజ మాత్రం సందీప్ మాస్టర్ ను తాను కావాలని నామినేట్ చేయలేదని సందీప్ అడిగి చేయించుకున్నాడని పేర్కొన్నారు. బిగ్ బాస్ హౌస్ లో టేస్టీ తేజ ఈ కామెంట్లు చేశారు. అయితే సందీప్ మాత్రం తేజ చేసిన కామెంట్లలో నిజం లేదని చెబుతున్నారు. అయితే టేస్టీ తేజకు ఎలిమినేట్ అయిన తర్వాత సందీప్ మాస్టర్ మిమ్మల్ని అడిగి కావాలనే ఎలిమినేట్ చేయించుకున్నారా అనే ప్రశ్న ఎదురు కాగా సమాధానం చెప్పడానికి తేజ ఇష్టపడలేదు.

బిగ్ బాస్ హౌస్ లోపల ఏం జరిగిందనేది మీకు తెలియదని దీని గురించి ఇప్పుడేం మాట్లాడదలచుకోలేదని ఈ విషయం గురించి నేను, సందీప్ కలిసి వీడియో చేస్తామని అన్నారు. టేస్టీ తేజ ఈ విధంగా చెప్పడంతో కొంతమంది తేజదే తప్పు ఉండవచ్చని చెబుతున్నారు. టేస్టీ తేజ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని కామెంట్లు చేస్తున్నారు.

టేస్టీ తేజ (Tasty Teja) రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. టేస్టీ తేజను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. టేస్టీ తేజ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. బిగ్ బాస్ షో వల్ల టేస్టీ తేజ మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus