విజయ్ దేవరకొండ విజయానికి అల్లు అర్జున్ గిఫ్ట్

  • November 19, 2018 / 06:42 AM IST

అల్లు అర్జున్ & విజయ్ దేవరకొండ ఈ ఇద్దరు హీరోలకి ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా సింక్ అయ్యిందో తెలియదు కానీ.. ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. విజయ్ దేవరకొండ ప్రతి సినిమాకి అల్లు అర్జున్ కాన్స్టాంట్ గా సపోర్ట్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ “గీత గోవిందం” సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరవ్వడమే కాక ఆ సినిమా సాధించిన అఖండ విజయానికి పెద్ద పార్టీ కూడా హోస్ట్ చేశాడు అల్లు అర్జున్. ఇప్పుడు “టాక్సీవాలా” విషయంలో కూడా అదే తరహాలో రెస్పాండ్ అయ్యాడు బన్నీ. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ కరడుగట్టిన మెగా అభిమాని మాత్రమే కాక అల్లు అర్జున్ కి చాలా ఇష్టమైన వ్యక్తి కావడంతోపాటు విజయ్ దేవరకొండ హీరోగా నటించి ఉండడంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసి.. టీం అందరినీ విష్ చేయడమే కాక విజయ్ దేవరకొండని ప్రశంసలతో ముంచెత్తాడు.

అలాగే.. “టాక్సీవాలా” సాధిస్తున్న విజయాన్ని ప్రోత్సహిస్తూ నిన్న రాత్రి ఒక లావిష్ పార్టీ ఎరేంజ్ చేశాడు అల్లు అర్జున్. ఈ పార్టీకి “టాక్సీవాలా” టీం తోపాటు తమ బ్యానర్ లో సినిమాలు తీస్తున్న దర్శకులు మరియు కొందరు యువ దర్శకులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఒక అగ్ర కథానాయకుడైన అల్లు అర్జున్ ఇలా మీడియం బడ్జెట్ సినిమాలను, చిత్ర బృందాలను ఎంకరేజ్ చేస్తూ పార్టీలు హోస్ట్ చేయడం అనేది అభినందనీయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus