Teja Sajja: హనుమాన్ సినిమా కోసం తేజ ఇన్ని సినిమాలు వదులుకున్నారా?

తేజ సజ్జ ఇటీవల హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జై హనుమాన్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే జై హనుమాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తేజ హనుమాన్ సినిమా గురించి మాట్లాడుతూ పల్లె విషయాలను వెల్లడించారు ఈ సినిమా కోసం ఆయన చేసిన త్యాగాలను గురించి ఈ సందర్భంగా తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి హనుమాన్ సినిమాకు తాను (Teja Sajja) కామెంట్ అయిన తర్వాత తనకు సుమారు 70 నుంచి 75 సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇందులో సుమారు 15 సినిమాలు వరకు చాలా డీసెంట్ కథలు ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. వాటిని నేను హనుమాన్ సినిమా కోసం వదులుకున్ననాని తెలిపారు. ఇలా ఈయన కామెంట్స్ చేయడంతో మీరు చేసిన గొప్ప త్యాగానికి హనుమాన్ రూపంలో మంచి ఫలితం దక్కిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక జై హనుమాన్ సినిమాలో చిరు నటిస్తున్నారని వర్మ తెలపడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus