సైరా టీం కి షాక్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్

అఖిలాండ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు, మెగాస్టార్, పార్లమెంట్ మెంబర్ అయిన చిరంజీవి ఇల్లు కూల్చేయడం ఏంటి? అని కంగారు పడుతున్నారా. ఇల్లు కూల్చిన మాట నిజమే కానీ.. అది ఆయన నివాసముంటున్న హైద్రాబాద్ లోని బంగ్లా కాదు.. ఆయన ఉయ్యలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్న “సైరా” సినిమా కోసం నిర్మించిన గృహాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నిజానికి.. హైద్రాబాద్ లోని బూత్ బంగ్లాలో “రంగస్థలం” కోసం వేసిన విలేజ్ సెట్ కే కాసిన్ని మార్పులు చేర్పులు చేసి “సైరా” కోసం కొన్ని సెట్స్ వేశారు. వాటిలో నరసింహారెడ్డి గృహం కూడా ఉంది. ఆ సెట్ మొత్తం కబ్జా చేసిన సెట్ లో వేసి ఉండడంతో రెవెన్యూ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చిన చిత్ర బృందం పట్టించుకోకపోతుండడంతో.. డైరెక్ట్ గా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి “సైరా” సెట్స్ ను కూల్చివేశారట.

అయితే.. లక్కీగా ఆ సెట్ లో షూట్ చేయాల్సిన సన్నివేశాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతో పెద్ద రిస్క్ ఏమీ లేదు కానీ.. ఏవైనా సన్నివేశాలు మళ్ళీ రీషూట్ చేయాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. అయితే.. రెవెన్యూ అధికారులు చెబుతున్న కారణం కూడా సరైనదే.. ఇలా సెట్స్ వేసిన స్థలాలను అనంతరం కబ్జా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రెవెన్యూ అధికారులు ముందు జాగ్రత్తగా ధ్వంసం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus