నంది అవార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం!

  • February 1, 2024 / 01:37 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేట్‌ అయితే అయ్యేవి కానీ… నంది అవార్డులు అయితే వచ్చేవి. రెండేళ్లకు ఒకసారి ఇచ్చినా ఆ గౌరవం కోసం సినిమా జనాలు ఎంతగానో ఎదురుచూసేవారు. అయితే ఒక్క రాష్ట్రం కాస్త తెలుగు రాష్ట్రాలు అంటూ రెండు ముక్కలు అయ్యాక ఆ ఆనందానికి సినిమా జనాలు నోచుకోలేకపోతున్నారు. ఇటీవల ఈ అవార్డుల గురించి చాలామంది సినీ ప్రముఖులు మాట్లాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి వద్దకు కూడా విషయం వెళ్లింది.

తెలంగాణ కొత్త ప్రభుత్వం తాజాగా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నంది పురస్కారాలను ఇకపై ఇచ్చేది లేదని ప్రకటించింది. అయితే ఆ స్థానంలో గద్దర్‌ పురస్కారాలను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపింది. కవులు, కళాకారులు, సినీ నటులకు ఇకపై ఏటా గద్దరన్న పురస్కారాలు అందించి గౌరవించుకుంటాం అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో పరిశ్రమ నుండి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. సమాజాన్ని చైతన్యపరిచేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దర్. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమం మొదలు పెట్టిందీ ఆయనే. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు మాకు స్ఫూర్తి. ఆయనతో మాట్లాడితే మాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చేది. అందుకే ఆయన పేరును పురస్కారాలు ఇస్తామని చెప్పారు.

ఇటీవల తనను కొంతమంది సినీ ప్రముఖులు కలిశారని, ఆపేసిన (Nandi Awards) నంది అవార్డుల్ని పునరుద్ధరిస్తే బాగుంటుందని కోరారని సీఎం చెప్పారు. అంతే కాదు నా మాటనే జీవో, ఇదే శాసనం అంటూ ఈ అవార్డుల విషయంలో తన ఆలోచనను చెప్పేశారు రేవంత్‌ రెడ్డి. అన్నట్లు ఈ అవార్డులు ప్రకటించిన బుధవారం గద్దర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus