Bheemla Nayak Song: తెలంగాణ పోలీసుల అభ్యంతరం.. మేకర్స్ ఏమంటారో?

పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాపై భారీగా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ కాగా ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు 7.5 మిలియన్ల వ్యూస్ రాగా 7.6 లక్షల లైక్స్ వచ్చాయి. అయితే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పై తెలంగాణ పోలీసుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది.

డీసీపీ రమేష్ ట్విట్టర్ ద్వారా పాటలోని కొన్ని పదాలు పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసులు అని తమ రక్షణ కొరకు మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు తాము విరగ్గొట్టమని డీసీపీ రమేష్ ట్వీట్ లో చెప్పుకొచ్చారు. పాట రచయిత రామజోగయ్యశాస్త్రికి పోలీసుల గురించి వివరించడానికి ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయని డీసీపీ రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల నుంచి పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

డీసీపీ రమేష్ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో పవన్, రానా హీరోలుగా ఈ సినిమాను నిర్మిస్తోంది. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యామీనన్ నటిస్తుండగా రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus