కృష్ణ వెబ్‌ సిరీస్‌ కాన్సెప్ట్‌ ఇదేనా?

కృష్ణ వంశీ మెగాఫోన్‌ పట్టుకుంటే ఆ కథలో క్రియేటివిటీ, కొత్తదనం ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన ఓటీటీ కోసం తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌ చేయబోతున్నారు. రూ.300 కోట్ల‌తో ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాన‌ని ఇటీవల కృష్ణ‌వంశీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంత బడ్జెట్‌తో వెబ్‌సిరీసా? కథేంటో అని చర్చ సోషల్‌ మీడియాలో నడుస్తోంది. దీనికి సమాధానం ఓ పెద్ద చరిత్ర అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న కథ.. తెలంగాణ సాయుధ పోరాటం.

తెలంగాణ పోరాటాన్ని సినిమాగా తీశారు గానీ, వెబ్ సిరీస్‌గా ఇప్పటివరకు ఎవరూ తీయలేదు. కృష్ణ వంశీ ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారట. తెలంగాణ చ‌రిత్ర‌లో చాలా అంశాలున్నాయి. వాటిని ఈ వెబ్‌ సిరీస్‌లో విడ‌మ‌ర‌చి చెప్ప‌బోతున్నారట కృష్ణ‌వంశీ. ఈ సిరీస్‌ను ఐదు సీజ‌న్లుగా రూపొందించే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో సీజ‌న్‌లో 10 ఎపిసోడ్ల వరకు ఉంటాయి అని అంటున్నారు. అంటే మొత్తంగా 50 ఎపిసోడ్లలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూపిస్తారు

ఈ లెక్కన పోరాటంలో ప్ర‌తి విష‌యాన్నీ కూలంకుశంగా చూపించే అవకాశం ఉంది తెలుస్తోంది. తెలంగాణ సాయుధ పోరాటం గురించి నేటితరం యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే దానినే కథాంశంగా తీసుకున్నారని చెబుతున్నారు. తెలంగాణ చ‌రిత్ర గురించి, తెలంగాణ వీరుల గురించి తెలుసుకోవ‌డానికి వంశీ టీమ్‌ ఆల్‌రెడీ పని మొదలుపెట్టిందట. దీని కోసం చ‌రిత్రకారుల్ని కలిసి వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ఉన్నారట.

కృష్ణ వంశీ తెర‌కెక్కిస్తున్న ‘రంగ‌మార్తాండ’ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దీని తర్వాత ‘అన్నం’ అనే సినిమాను స్టార్ట్‌ చేస్తారట. పోస్టర్‌తోనే ఆ సినిమా మీద అంచనాలు వచ్చేలా చేశారు కృష్ణ వంశీ. మరి సినిమా ంఒదలయ్యాక ఇంకెన్ని సంచలనాలు తెలుస్తాయో చూడాలి. ఆ సినిమా తర్వాతే తెలంగాణ సాయుధ పోరాటం వెబ్‌ సిరీస్‌ ఉంటుందని చెబుతున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus