హాఫ్ సెంచరీలో సేఫ్ సినీమాలెన్నీ?

  • June 9, 2016 / 11:44 AM IST

కొన్ని రోజుల్లో 2016 అర్ధ భాగం కరిగిపోనుంది. ఈ కాలంలో యాభైకి పైగా తెలుగు సినిమాలు థియేటర్ల లోకి వచ్చాయి. వాటిలో చిన్న సినిమాలు రూ. 20 కోట్లు వసూలు చేసి గొప్ప విజయం అందుకోగా.. పెద్ద సినిమాలు 50 కోట్లు రాబట్టినా ఫ్లాప్ జాబితాలోనే ఉండిపోయాయి. భారీ అంచనాలతో వచ్చిన కొన్నిసినిమాల టోటల్ కలక్షన్ వివరాలు..

1. జనవరిలో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ “నేను శైలజ” రూ. 23.65 కోట్లు వసూలు చేసి రామ్ కి గొప్ప విజయాన్ని అందించింది. 2016 లో ఇండస్ట్రీ అందుకున్నతొలి విజయం ఇది.2. సంక్రాంతికి విడుదలైన వాటిలో “నాన్నకు ప్రేమతో” రూ. 55.60 కోట్లు, ఎక్స్ ప్రెస్ రాజా రూ.13.30కోట్లు, డిక్టేటర్ రూ.22.87కోట్లు రాబట్టాయి. సంక్రాంతి కోడిపుంజుగా సోగ్గాడే చిన్ని నాయన నిలిచింది. ఈ సినిమా రూ. 50.10 కోట్లు వసూలు చేసింది. “నాన్నకు ప్రేమతో” బడ్జెక్ట్ తో పోలిస్తే “సోగ్గాడే చిన్నినాయన” తక్కువ కాబట్టి … ఎక్కువ లాభాలను బంగార్రాజు సొంతం చేసుకున్నాడు.5. ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాల్లో రూ. 8 కోట్లతో “క్షణం” సూపర్ హిట్ గా నిలిచింది. కోటి రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా విజయం చిన్న సినిమాలకు ఉత్సాహాన్ని ఇచ్చింది.6. హాస్యనటుడి స్థాయి నుంచి హీరోగా ఎదిగిన సునీల్ పూర్తి యాక్షన్ సినిమా “కృష్ణాష్టమి” తో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీ రూ. 8.66 కోట్ల వద్దే చతికిల పడింది.7. ఫ్రెండ్ షిప్ కథతో వచ్చిన “స్పీడున్నోడు” సేఫ్ జోన్లోనే పడ్డాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీను ఎనర్జటిక్ హీరోగా నటించి రూ.5.20 కోట్లు రాబట్టాడు.8. నాని తాను భయపడుతూ ప్రేక్షకులను నవ్వించిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఈ సినిమా రూ. 18.50 కోట్లు రాబట్టి నిర్మాతకి లాభాలను తెచ్చిపెట్టాయి.9. కింగ్ నాగార్జున రెండు నెలల వ్యధిలోనే మరో హిట్ ని అందుకున్నాడు. మార్చిలో రిలీజ్ అయిన “ఊపిరి” రూ.51.60 కోట్లు కొల్లగొట్టింది. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని తాజాగా ఈ చిత్రం నిరూపించింది. పీవీపీ వారికి కూడా ఈ ఏడాదిలో రెండో హిట్ గా “ఊపిరి” నిలిచింది.10. యువ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన కళ్యాణ వైభోగమే క్లాస్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా రూ. 8 కోట్లు వసూల్ చేసింది.11. మంచు మనోజ్ రెజీనా కలిసి నటించిన శౌర్య రూ. 4 కోట్లు రాబట్టగలిగింది. నారా రోహిత్ తుంటరి రూ. 4 కోట్లు, సందీప్ కిషన్ రన్ రూ. 4.12 కోట్లు మాత్రమే వసూలు చేసాయి.12. వేసవి వినోదంగా నిలుస్తుందని భావించిన పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆశించినంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏప్రల్ 8న విడుదలైన ఈ సినిమా రూ.55 కోట్లు రాబట్టిన ఫలితం లేకుండా పోయింది. ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది.13. తొలుత ఫ్లాప్ అని టాక్ తెచ్చుకున్న సరైనోడు చిత్రం రూ. 74 కోట్లు వసూలు చేసి అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ ని ఇచ్చింది.14. నారా రోహిత్ సినిమా సావిత్రి రూ. 2 కోట్లకే పరిమతం కాగా, ఈడో రకం ఆడో రకం సినిమాకు రూ. 12.50 కోట్ల కలక్షన్లు వచ్చాయి.15. మే నెలలో ఎప్పుడూ పెద్దచిత్రాలు హల్ చల్ చేసేవి. ఈ ఏడాది మాత్రం నాలుగు సినిమాలే వచ్చాయి. వాటిలో మంచు విష్ణు ” సరదా”, విశ్వ కమల్ “21st (film) ” చిత్రాలు థియేటర్లకు ఎప్పుడు వచ్చాయో .. వెళ్లాయో తెలియలేదు. “సుప్రీమ్” సినిమా రూ. 21 కోట్లు వసూలు చేసి సాయి ధరమ్ తేజ్ రేంజ్ ని పెంచింది.16. భారీ తారాగణం, రూ.70 కోట్ల బడ్జెక్ట్ తో రూపొందిన బ్రహ్మోత్సవం సినిమా ఈ నెలలోనే ఎన్నో అంచనాలతో విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతంగా నటించినా కలక్షన్లు రూ. 40 కోట్లకు మించలేక పోయింది.17. జూన్ 2న రిలీజ్ అయిన “అ.. ఆ” సినిమా తొలిరోజే రూ.14 కోట్లు వసూల్ చేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ పవర్ ను చూపించాయి. నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రూ. 50 కోట్ల మార్కును సులువుగా దాటేస్తుందని టాలీవుడ్ బిజినెస్ వర్గాలు అంచనా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus