అనన్య నాగళ్ళ.. పరిచయం అవసరం లేని పేరు. తెలుగమ్మాయి ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో పల్లెటూరి అమ్మాయి/పక్కింటి అమ్మాయి పద్మ పాత్రలో ఒదిగిపోయిన విధానం తెలుగు ప్రేక్షకులందరినీ అమితంగా ఆకట్టుకుంది. అటు తర్వాత చేసిన ‘ప్లే బ్యాక్’ సినిమాతో అనన్యకి మంచి కథలు ఎంపిక చేసుకునే టాలెంట్ ఉంది అని బయటపడింది.
అందుకే వెంటనే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘వకీల్ సాబ్’ వంటి పెద్ద సినిమా తెచ్చిపెట్టిన ఇమేజ్ తో అనన్య ట్రాక్ తప్పినట్టు అంతా చెప్పుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా తర్వాత పెద్ద లీగ్లోకి వెళ్ళాలి అనే థాట్ ఈమెలో బలంగా ఏర్పడింది అనుకుంట. అప్పటి నుండి గ్లామర్ వైపు దృష్టి పెట్టింది.నితిన్ ‘మ్యాస్ట్రో’, సమంత ‘శాకుంతలం’, సీనియర్ నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ వంటి సినిమాల్లో అనవసరమైన పాత్రలు చేసింది.

ఆ సినిమాలు ప్లాప్ అవ్వడంతో పాటు అనన్య టాలెంట్, స్టోరీ సెలక్షన్ పై అనుమానం కలిగేలా చేశాయి. తర్వాత ఆమె తప్పు తెలుసుకుని ‘తంత్ర’ ‘పొట్టేల్’ వంటి సినిమాలు చేసినా ఉపయోగం లేకపోయింది. తన స్ట్రెంత్ వదిలేసి గ్లామర్ పై దృష్టి పెట్టడం అనన్యకి కలిసి రాలేదు. తెలుగమ్మాయి కదా అని అనన్యకి ఓ సింపతీ ఉండేది. అది రోజురోజుకీ ఈమె పోగొట్టుకుంటుంది అనేది కొందరి అభిప్రాయం.
ప్రస్తుతం బాలీవుడ్లో నటించే ఛాన్స్ ఈమె దక్కడంతో.. గ్లామర్ షోకి పెట్టుకున్న హద్దులు అన్నీ దాటేసినట్టు ఈమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే అర్ధం చేసుకోవచ్చు.
