Actress: రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నాది!

సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వారిలో నటి గాయత్రి గుప్తా ఒకరు. ఈమె హీరోయిన్ గా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. హీరోయిన్ గాయత్రి కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్ వంటి సినిమాలలో నటించారు. అనంతరం రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ ఐస్ క్రీం 2 వంటి సినిమాలలో కూడా హీరోయిన్గా నటించారు.

ఇలా హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యపరంగా తాను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నానని తెలిపారు. రేపు ఏం జరుగుతుందనేది కూడా తెలియని పరిస్థితి నాది.

నా ఆరోగ్యం కోసం డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టుకున్నాను అయితే విరాళాలు కూడా సేకరించాలని నేను అనుకుంటున్నానని తెలిపారు. ఇక తన తండ్రిని తాను ఎప్పుడూ కూడా ఒక నాన్నగా భావించలేదంటూ గాయత్రి గుప్తా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.. అంతేకాకుండా ఈమె నటించినటువంటి పలు సినిమాలలో తన క్యారెక్టర్ చాలా బోల్డ్ ఉందన్న పదాల గురించి కూడా ఈమె స్పందించారు.

డైరెక్టర్లు ఎప్పుడూ కూడా తమ క్యారెక్టర్ కు కావలసిన పొటెన్షియాలిటీ ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటారు అంటూ ఈ సందర్భంగా గాయత్రి గుప్తా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె తాజాగా దయ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె(Actress) తన ఆరోగ్యం గురించి చెబుతూ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus