సింగర్ కౌసల్యకి దరిద్రమైన మెసేజ్ లు చేస్తూ వేధిస్తున్నారు!

  • January 4, 2020 / 06:45 PM IST

సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలకు ఎదురయ్యే వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీ ప్రముఖలను టార్గెట్ చేస్తూ చాలా మంది దూషిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. తాజాగా ప్రముఖ గాయని కౌసల్య కూడా వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. తన ఫోన్ నెంబర్ తెలుసుకొని రోజూ దరిద్రమైన మెసేజ్ లు పంపిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ తన బాధని వ్యక్తం చేసింది. తనతో పాటు కౌసల్య మ్యూజిక్ అకాడమీలో ఉన్న చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయని చెప్పింది. అది కూడా ఒకటే నెంబర్స్ నుండి వస్తున్నట్లు.. ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని తన అనుమానాలు వ్యక్తం చేసింది.

ఓ కార్యక్రమం కోసం పోస్టర్లు సిద్ధం చేయించి తమ నెంబర్లు కూడా ప్రింట్ చేసినట్లు.. ఆ నెంబర్స్ ఆధారంగా ఇలా మెసేజ్ లు చేస్తున్నారని తెలిపింది. తమలానే ఇలాంటి వేధింపు ఎదుర్కొంటున్న ఆడపిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి విషయాలపై ఫిర్యాదులు చేయడానికి పోలీసులు ఓ వాట్సాప్ గ్రూప్ పెడితే బాగుంటుందని అన్నారు. వేధింపుల నుండి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు నెంబర్లను బ్లాక్ చేస్తుంటే.. వారు మాత్రం కొత్త నెంబర్ల నుండి మెసేజ్ లు చేస్తూనే ఉన్నారని.. అందుకే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

1

2

3

4

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus