‘ఠాగూర్’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుందా? ‘తెలుగువాళ్లు సెంటిమెంటల్ అని… తెలుగు వాళ్లు ఎవరి మీదా అంత త్వరగా అభిమానం పెంచుకోరు. ఒకవేళ పెంచుకుంటే చనిపోయేంతవరకు వదిలిపెట్టరు’ అని. ఆ డైలాగ్ అందులో హీరో పాత్ర కోసం రాశారు. అయితే ఆ డైలాగ్ ఇంకొచెం మారిస్తే తెలుగు సినిమా ప్రేక్షకుల ప్రేమను చెప్పడానికి వాడొచ్చు. అదే ‘తెలుగువాళ్లు సినిమా పిచ్చోళ్లు. ఒక సినిమా నచ్చింది అంటే.. చూసేంతవరకు వదిలిపెట్టరు, హిట్ చేయడం మానరు. దానికి భాషతో పని లేదు’. ఏంటీ ఇంత ఎమోషనల్ డైలాగ్ అనుకుంటున్నారా?
మేం చెప్పే విషయం చదివితే మీరు కూడా ఇలానే అనుకుంటారు. కావాలంటే మీరే చూడండి మన దగ్గర ఓ సినిమా వస్తే అది ఏ భాష నుండి వచ్చింది, ఎవరు నటించారు అని చూడం. సినిమా నచ్చింది అంటే కోట్లు బాక్సాఫీసు దగ్గర వచ్చి పడతాయి. జనాలు థియేటర్లకు క్యూలు కడతారు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది షారుఖ్ ఖాన్ ‘జవాన్’. సెప్టెంబరు 7న విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్పందనే వస్తోంది. మొత్తంగా ఈ సినిమా రూ. 129.6 కోట్లు వసూలు చేసింది. అందులో తెలుగు (Telugu Fans) రాష్ట్రాల వాటా ఎక్కువేనట.
అలా అని ఏదో స్టార్ హీరోల సినిమాలు వస్తేనే మన వాళ్లు లైక్ చేస్తున్నారు అనడానికి లేదు. ఇతర భాషల్లో వచ్చిన చిన్న హీరో సినిమా బాగున్నా మనవాళ్లు తెగ చూసేస్తున్నారు. సినిమాలను భారీ హిట్లుగా మార్చేస్తున్నారు. కన్నడ నాట తప్ప ఎవరికీ తెలియని యశ్ ‘కేజీయఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ‘కాంతార’ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘777 ఛార్లీ’ సినిమా చిన్న సినిమాగా వచ్చి అదిరగొట్టింది. మొన్నీమధ్య వచ్చిన ‘బాయ్స్ హాస్టల్’ ఒరిజినల్ కన్నడ వెర్షన్ (హాస్టల్ హుడుగారు బేకగిద్దర) ను కూడా బాగా ఆదరించారు.
ఇప్పుడు ‘సప్తసాగర దాచే అల్లెల్లో – సైడ్ ఏ’ కూడా మంచి టాక్ సంపాదించుకుంది. ఇక రజనీకాంత్ ‘జైలర్’, కమల్ హాసన్ ‘విక్రమ్’ వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇదే సమయంలో ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలు చూడలేదట. అంటే మనసుకు నచ్చి, అర్థమైతే ఇతర భాషల సినిమాలకు భారీ విజయాలు పక్కా అని చెప్పొచ్చు. ఈ ధైర్యంతోనే ఇప్పుడు విజయ్ ‘లియో’ సినిమాకు భారీ మొత్తంలో డబ్బులు పెట్టి రిలీజ్ చేస్తున్నారని టాక్.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!