సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘తెలుసు కదా’ (Telusu Kada). కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారి చేసిన సినిమా ఇది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడు. అక్టోబర్ 17న రిలీజ్ అయ్యింది ఈ సినిమా.
మొదటి రోజు మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ సో సో గానే వచ్చాయి. దీపావళి సెలవుల తర్వాత కలెక్షన్స్ తగ్గిపోయాయి. రెండో వీకెండ్ కు అనుకున్న స్థాయిలో క్యాష్ చేసుకోలేదు. తర్వాత పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు.2వ వారం ఈ సినిమా చేతులెత్తేసింది.
ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
2.43 cr
సీడెడ్
0.51 cr
ఆంధ్ర(టోటల్)
1.86 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
4.80 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.44 cr
ఓవర్సీస్
1.55 cr
టోటల్ వరల్డ్ వైడ్
6.79 కోట్లు(షేర్)
‘తెలుసు కదా’ (Telusu Kada) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.19.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 వారాల్లో ఈ సినిమా కేవలం రూ.6.79 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.12.09 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.13.21 కోట్ల షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ అన్ని విధాలుగా కష్టమే. ఇప్పుడు ప్రేక్షకులకు ‘బాహుబలి ది ఎపిక్’ ‘మాస్ జాతర’ వంటి సినిమాలు ఫస్ట్ ఆప్షన్ అయిపోతాయి.