సుజీత్ కు ఇంత క్రేజ్.. ఎలా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం విడుదలయ్యి వారం రోజులు పూర్తయ్యింది. మొదటి వీకెండ్ కలెక్షన్స్ బాగా వచ్చాయి ఇక సోమవారం కూడా వినాయక చవితి సెలవు రావడంతో ఆ రోజు కూడా మంచి కలెక్షన్లే వచ్చాయి. అయితే మొదటిరోజు నెగిటివ్ రివ్యూలు రావడంతో ఆ ఎఫెక్ట్ వీక్డ్ డేస్ కలెక్షన్ల పై బలంగా పడింది. ఇక ప్రభాస్ తన స్టామినాతో నెట్టుకుంటూ వస్తున్నాడు కానీ అది ఈ సినిమా బడ్జెట్ రేంజ్లో మాత్రం రావడం లేదు. హిందీలో మాత్రం ‘సాహో’ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

ఈ విషయాన్నీ గుర్తు చేసుకుంటూ ‘సాహో’ దర్శకుడు సుజిత్ ఇటీవల ఎవరు ఊహించని విషయాన్ని చెప్పుకొచ్చాడు. సుజీత్ మాట్లాడుతూ… “బీహార్ నుండీ చాలా పాజిటివ్ కాల్స్ వస్తున్నాయి. నేను గనుక అక్కడ పుట్టి ఉంటే గుడి కట్టేసే వాళ్ళమని వాళ్ళు చెప్పారు. ‘సాహో’ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని కూడా చెబుతున్నారు. ఇక నుండీ స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు ఇంటిలిజెన్స్ ని తగ్గించుకొని సినిమాలు చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సుజీత్ ‘సాహో’ అనే ఒక్క సినిమాతో చాలా పాఠాలు నేర్చుకున్నాడని స్పష్టంగా తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus